Thursday, 5 November 2026

అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి
* అంగన్వాడీల భారీ ప్రదర్శన, మానవహారం
* సిఐటియు ఎఐటియుసి నాయకురాళ్లు శకుంతల, ఇందిరా

టేకులపల్లి, సెప్టెంబర్ 21( జనం సాక్షి): అంగన్వాడీ ఉద్యోగులు హక్కుల సాధనలో భాగంగా న్యాయమైన సమస్యల కోసం 11 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరించడం సరియైనది కాదని, వెంటనే చర్చలకు పిలిచి పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకురాలు కొండపల్లి శకుంతల, ఏఐటీయుసి జిల్లా నాయకురాలు వై ఇందిరా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్ల సమస్యల సాధన కోసం 11వ రోజు జరుగుతున్న సమ్మెకు మద్దతుగా గురువారం ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో మనవహారం, టేకులపల్లి తహసిల్దార్ కార్యాలయం నుండి భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిశు సంక్షేమ శాఖ మంత్రి అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలనడం ప్రభుత్వం మొండి వైఖరికి నిదర్శనం అన్నారు. శాంతియుతంగా తమ న్యాయమైన సమస్యలను తీర్చాలని సమ్మె చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులను బెదిరింపులకు గురి చేయడం లాంటి చౌకబారు మాటలు మానాలని అన్నారు. సమ్మెలో ఉన్న యూనియన్లకు పిలిచి వారి ప్రధాన డిమాండ్లు అంగీకరించాలని, కనీస వేతనాలు, పెన్షన్ గౌరవ ప్రధమైన రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని అన్నారు. సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన సమ్మె ఆగదని హెచ్చరించారు. 11వ రోజు మనవహారం, ప్రదర్శన ఇంత గొప్పగా నిర్వహించిన అంగన్వాడి టీచర్లు, ఆయాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సిపిఐ పార్టీ జిల్లా నాయకులు గుగులోతు రామచందర్, ఏఐటీయూసీ మండల వైస్ ప్రెసిడెంట్ అయితా శ్రీరాములు,సిఐటియు జిల్లా నాయకులు కె వీరన్న, అంగన్వాడి మండల నాయకులు వై పద్మావతి, వి సంధ్యారాణి,ఎం నాగమణి,ఎన్ విజయ�