Thursday, 5 November 2026

విద్యా, వైద్యానికి “లయన్స్ క్లబ్” విస్తృత సేవలు :మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ మోహన్ రావు తీగల

హాజరైన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ వి శివప్రసాద్

* లయన్స్ క్లబ్ సిజేఎస్ఎస్ దివ్యాంగా, లయన్స్ క్లబ్ వనిత డైమండ్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం…

*అధ్యక్షులు కోల సైదులు ముదిరాజ్ కు ఘన సన్మానం

మిర్యాలగూడ, జనం సాక్షి.సెప్టెంబర్ 21

విద్య వైద్యానికి లయన్స్ క్లబ్ ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నామని కార్యక్రమం ముఖ్యఅతిథి మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ మోహన్ రావు తీగల అన్నారు.గురువారం మిర్యాలగూడ పట్టణంలోని బృందావన్ గార్డెన్స్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గ్రేటర్ పరిధిలో లయన్స్ క్లబ్ సిజేఎస్ దివ్యాంగా, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వనిత డైమండ్ కార్యవర్గం ప్రమాణ,బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రావు తీగల మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు సైతం లయన్స్ క్లబ్ సేవలు అందిస్తున్నామన్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్. వి. శివప్రసాద్ మాట్లాడుతూ దేశ విదేశాలలో లయన్స్ క్లబ్ సేవలతో పలువురి ప్రశంసలు పొందడం జరుగుతుందన్నారు. మిర్యాలగూడ తో పాటు ముఖ్య పట్టణాలలో ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లను చేయించడంతోపాటు విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ లయన్స్ సేవలు విస్తరించాయన్నారు. హైదరాబాద్ నగరంలో రూ 3 కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ ఏర్పాటుచేసి వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. నిరంతరం సేవలందించడమే లక్ష్యంగా లయన్స్ లీడర్స్ పనిచేస్తున్నారని ఆయన అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్) నేతృత్వంలో లయన్స్ క్లబ్ బాధ్యులు నిర్వహిస్తున్న నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం ద్వారా చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. కొత్తగా ఏర్పడిన సిజేఎస్ఎస్ దివ్యాంగా, వనిత డైమండ్ కార్యవర్గ సభ్యులు సేవలను విస్తరించాలని, ప్రజల మననలు పొందాలన్నారు. లయన్స్ క్లబ్ సిజేఎస్ఎస్ దివ్యాంగా అధ్యక్షులుగా కోలా సైదులు ముదిరాజ్ తో పాటు కార్యవర్గం, వనిత డైమండ్ కార్యవర్గం, ప్రధాన కార్యదర్శి మాశెట్టి గీత (డైమండ్) ప్రమాణ స్వీకారోత్సవం చేయడంతో లయన్ లీడర్స్ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమ ఎక్స్టెన్షన్ పర్సన్, డిస్టిక్ సెక్రటరీ మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్) వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ డిస్టిక్ గవర్నర్ కే.ఎన్. ప్రసాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు కర్నాటి రమేష్ కార్యదర్శి లింగయ్య బి. ఎం. నాయుడు తో పాటు జాతీయ చెస్ క్రీడాకారిణి కోచ్, లయన్ దివ్య మాశెట్టి, లయన్స్ లీడర్స్ మొక్కపాటి వెంకటేశ్వరరావు, డాక్టర్ జాడీ రాజు, సాదినేని శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోశయ్య, వర్షిత హాస్పిటల్స్ చైర్మన్ కూటాల రాంబాబు, టిఆర్ఎస్ నాయకులు కోల వెంకన్న ముదిరాజ్, అంతకుముందు జ్యోతి హాస్పిటల్స్ అధినేత లయన్ డాక్టర్ మువ్వ రామారావు నేతృత్వంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తదితరులు పాల్గొన్నారు.