Thursday, 5 November 2026

ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

దేవరకొండ Friendship 21
(జనం సాక్షి):-

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి అని
క్రీడలు దేహదారుఢ్యం తో పాటు ఆత్మవిశ్వాసం పెంపునకు మార్గమని, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులకు ఎలా అధిగమించాలో తెలియజేస్తాయని
దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.గురువారం బీసీ గురుకుల పాఠశాలలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.క్రీడాకారులకు, కళాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని,గురుకుల పాఠశాలలో ప్రతి విద్యార్థికి రూ.1.20లక్షలు ఖర్చు చేస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి,జెడ్పిటిసి సలహాదారుడు మారుపాకుల సురేష్ గౌడ్,వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,బిఅర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడీ,PACS చెర్మెన్ వేల్లుగురి వల్లపు రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొండేటి మల్లా రెడ్డి,RCO సకిన,ప్రిన్సిపాల్ రజిత,గోపాలకృష్ణ, చంద్రయ్య, బోడ్డుపల్లి కృష్ణ, కుంభం నరేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.