గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా పల్లా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం
రఘునాథ పాలెం సెప్టెంబర్ 21(జనం సాక్షి) ఖమ్మం సుగ్గుల వారి తోట , పాత శివాలయం పక్కన శివ గణేష్ ఉత్సవ కమిటీ ( 26 వార్షికోత్సవం ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా పల్లా కిరణ్ కుమార్ సహాయ సహకారాలతో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ మహా అన్నదాన కార్యక్రమంలో సుమారుగా 2000 మంది వరకు భక్తులు పాల్గొని మండపంలో ఉన్న వినాయకుని దర్శించుకుని భోజనం చేశారు ఈ సందర్భంగా పల్లా కిరణ్ కుమార్* మాట్లాడుతూ విఘ్నేశ్వరి కృప ఎల్లవేళలో ప్రజలందరిపై ఉండి సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు ఈ కార్యక్రమంలో శివ గణేష్ ఉత్సవ కమిటీ ముఖ్యులు సాంబ జగన్ రవి నరేష్ ప్రణయ్ సాయి గిరీష్ ప్రతాప్ చంటి సందీప్ హుస్సేన తదితరులు పాల్గొన్నారు




