ఘనంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి జన్మదిన వేడుక
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 21 (జనం సాక్షి);
గద్వాల పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ ఆధ్వర్వంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దంపతులకు చైర్మన్ కేశవ్ శాలువా గజమాలతో ఘనంగా సత్కరించి మొక్కను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేక్ చేశారు. ఎమ్మెల్యే కి పలువురు ముఖ్య నాయకులు కౌన్సిలర్స్ టౌన్ నాయకులు టీ.ఆర్.యస్ శ్రేణులు అభిమానులు గజలమాల పుష్పగుచ్చం ఇచ్చి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారులు, జిల్లా జర్నలిస్టులు తదితరులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




