Thursday, 5 November 2026

తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ రెండవ మరియు నాల్గవ సెమిస్టర్ ఫలితాల విడుదల..

తెలంగాణ యూనివర్సిటీ నిన్న ప్రకటించిన రెండవ మరియు నాల్గవ సెమిస్టర్ ఫలితాలలో ఎస్ ఆర్ కె డిగ్రీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.
ఈ సందర్భంగా ఆర్కే గ్రూప్ ఆఫ్ కరస్పాండెంట్ మరియు సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి
10/10 జిపిఏ సాధించిన విద్యార్థులను అభినందించారు.
1)నాలుగవ సెమిస్టర్ లో సిహెచ్ భావన బయోటెక్నాలజీ,
2)రెండవ సెమిస్టర్ లో ఎస్ నికిత బయోటెక్నాలజీలో 10/10 జిపిఏ సాధించిన వారిని అభినందించారు.అలాగే

ఎస్ నవీన బయోటెక్నాలజీ నాలుగవ సెమిస్టర్ 9.80 జిపిఏ,
కే హిమజ 9.60 జిపిఏ సెకండ్ సెమిస్టర్ బి ఏ,
పి అంకిత 9.68 జిపిఏ నాలుగవ సెమిస్టర్ ఎంఎస్టిడిఎస్,
డి రేఖ 9.56 జిపిఏ నాలుగవ సెమిస్టర్ బిజెడ్సి,
పి రుచిత 9.48 జిపిఏ సెకండ్ సెమ్ బిఎ,
టీ తబస్సుం 9.44 జిపిఏ నాలుగవ సెమిస్టర్ బయోటెక్నాలజీ,
వి శ్రీలేఖ 9.40 జిపిఏ నాలుగవ సెమిస్టర్ బిజినెస్ అనలిటిక్స్,
పి సంధ్య 9.40 జిపిఏ నాలుగవ సెమిస్టర్ బయో టెక్నాలజీ వచ్చిన విద్యార్థులను అభినందించారు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ ఆర్ కే కళాశాలలో 78 మంది విద్యార్థులు 9.జిపిఏ పైన సాధించారని,అలాగే వివిధ సబ్జెక్టులలో దాదాపుగా 558 మంది విద్యార్థులకు 10/10 రావడం జరిగిందని తెలియజేశారు.
ప్రతి విద్యార్థి కష్టపడాలని చదువు ఉంటేనే మీకు గుర్తింపు ఉంటుందని, మున్ముందు మంచి స్థాయిలో స్థిరపడుతారని,మీ తల్లిదండ్రులకు కళాశాలకు,చదువు చెప్పిన అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ కె కళాశాల ప్రిన్సిపాల్ దత్తాత్రి, మధుసూదన్ రెడ్డి,వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ బాల్ రెడ్డి, ఏవో దత్తు కుమార్ అధ్యాపకులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.సిహెచ్ భావన నాలుగవ సెమిస్టర్ బయోటెక్నాలజీ 10/10 జీపిఎ ఎస్ నికిత రెండవ సెమిస్టర్ బయోటెక్నాలజీ 10/10 జీపిఏ