తిరుమలగిరి (సాగర్ )మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి
బిజెపి రాష్ట్ర నాయకురాలు కంకణాల నివేదిత రెడ్డి
తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 21, (జనంసాక్షి):
మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర బిజెపి నాయకురాలు కంకణాల నివేదిత రెడ్డి గురువారం నల్లగొండ జిల్లా వైద్యాధికారి కొండలరావుకు ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుమలగిరి (సాగర్) మండలం ఏర్పడి ఏడు సంవత్సరాలు పూర్తికావస్తున్నప్పటికీ మండలంలో నేటి వరకు ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. మండలంలో 34 గ్రామపంచాయతీలు ఉండి, అత్యధిక శాతం గిరిజన తండాలు కలిగిన మండలం కావడంతో ప్రజలు రోగాల బారిన పడినప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స తీసుకోలేక ఆర్ఎంపీలను ఆశ్రయించి అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసుకుంటూ, సరైన వైద్యం అందక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని , దీంతో మండల ప్రజలు అత్యవసర పరిస్థితులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 108 వాహనం రావాలన్న సుమారు 40 కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని




