స్నేహితుని దుర్మరణం కలచివేసింది * ఫోటోగ్రాఫర్ లక్ష్మణ్ కుటుంబాన్ని ఆదుకుంటాం * ఆర్థిక సహాయం అందజేసిన స్నేహితులు
టేకులపల్లి, సెప్టెంబర్ 21 ( జనం సాక్షి): ఇటీవల టేకులపల్లి మండలంలోని లక్ష తండా కి చెందిన ఫోటోగ్రాఫర్ భూక్య లక్ష్మణ్ ఇల్లందు,కొత్తగూడెం ప్రధాన రహదారిలో ఆరవమైలు తండా సమీపాన రాత్రి సమయంలో రెండు మోటార్ సైకిల్ ఢీకొని ముగ్గురు దుర్మరణం పాలైన సంఘటన విధితమే. ఇద్దరు రోళ్ళపాడు గ్రామానికి చెందిన వారు కాగా, లక్ష్మణ్ లచ్చ తండా గ్రామానికి చెందినవారు. గురువారం లచ్చితండా గ్రామంలో లక్ష్మణ్ దశదినకర్మలు జరిగాయి. ఈ కార్యానికి 2000 సంవత్సరంలో టేకులపల్లి ఉన్నత పాఠశాలలో తనతో చదివిన 80 మంది స్నేహితులు ఇతర ప్రదేశాల నుండి చేరుకున్నారు. చదువుకున్న రోజులలో లక్ష్మణ్ అందరితో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవాడని, ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఉండేవాడని తన అకాల మరణం మా అందరిని కలిసి వేసిందని కుటుంబ సభ్యులను ఓదారుస్తూ తెలిపారు. లక్ష్మణ్ కుటుంబానికి అండగా ఉంటామని మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, ఇద్దరు కుమార్తెల పేరు మీద లక్ష రూపాయల మ్యూచువల్ ఫండ్ ఎస్బిఐ కాంట్రిబ్యూషన్ లో ఫిక్స్ డిపాజిట్ చేశామని తెలిపారు . ఎప్పుడైనా ఆపద వస్తే మేమున్నాము అనే విషయాన్ని మరవ కూడదని కుటుంబానికి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, సూర్య, రవి,మోహన్ రాయుడు,శ్రీకాంత్, మోహన్, భాస్కర్, శశికళ,నరేందర్, రమేష్, వీరస్వామి, వీరన్న, ప్రతాప్ తదితరులు ఉన్నారు.