ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు కలిసి సమన్వయంతో పనులు చేయాలి
ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి
వీణవంక సెప్టెంబర్ 21 (జనం సాక్షి) వీణవంక ప్రభుత్వ, ఉద్యోగుల ప్రజా ప్రతినిధులు ఇద్దరు కలిసి సమన్వయంతో పని చేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా ఉద్యోగం చేస్తున్న గాజుల భాస్కర్ స్వచ్ఛందగా ఉద్యోగ విరమణ చేపట్టగా ఆయనకు గురువారం ఘనంగా ఎంపీడీవో కార్యాలయంలో సత్కరించారు. ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథి ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సూపరింటెండెంట్, గాజుల భాస్కర్ మండలానికి చేసిన సేవలు గొప్పవని అన్నారు. ఆయన పనిపట్ల నిబద్దతో వ్యవహరిస్తూ తోటి ఉద్యోగస్తులతో స్నేహంగా ఉంటూ ప్రజాప్రతినిధులకు గాని ఇటు ప్రజల గాని చేసిన సేవలు మర్చిపోని అన్నారు .ఆయనకు ఇంకా 12 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా ఉద్యోగ విరమణ చేయడం బాధాకరమని అన్నారు. ఆయన ఎక్కడున్న పేద ప్రజాలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. సూపర్డెంట్ గాజుల భాస్కర్ మాట్లాడుతూ ఉద్యోగం చేయడం, అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేయడం కత్తిమీద సాములాంటిదని అన్నారు. కానీ తాను వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామంలో పుట్టి, సొంత మండలంలో పని చేయడం, ఉద్యోగ విరమణ చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. తాను నిర్వర్తించిన విధులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా తోడ్పాటు నందించిన ప్రజాప్రతినిధులు, తోటి ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీపీ, ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి. మండల కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ హమీద్ .మండల ఎంపీటీసీలు, మండల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కలిసి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సిబ్బంది తో పాటు తదితరులు పాల్గొన్నారు.




