అసత్యా ఆరోపణలు చేయడం సిగ్గుచేటు
మల్లాపూర్ సెప్టెంబర్21( జనం సాక్షి) మల్లాపూర్ మండలం లోని సాతారం గ్రామంలో కొందరు రాజకీయ కుట్రలు పన్ని అమాయకపు ప్రజలను అడ్డంగా పెట్టుకుని నిరసన ల పేరుతో గ్రామ సర్పంచ్ భర్త అవినీతికి పాల్పడినట్లు ఆరోపించడం సబబు కాదని బొడ్డు రాజేష్ అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసత్య ప్రచారాలతో ఇష్టానుసారంగా ఆరోపిస్తే సహించేది లేదన్నారు. ఓ పత్రికలో సర్పంచ్ భర్త రాజేష్ అవినీతికి పాల్పడినట్లు రాయడం దారుణమని అట్టి పత్రిక పై పరువు నష్టం దావా కింద కేసు వేసినట్లు తెలిపారు. గత పాలనలో ఏం జరిగింది. ఇప్పుడు ఎంత అభివృద్ధి జరుగుతోందనేది ప్రజలు గమనిస్తూనే వున్నారని అన్నారు. రాజకీయ ఎదుగుదల ఓర్వలేక ఆరోపణలు చేస్తే సహించేది లేదు అన్నారు.




