శిశు రక్ష హాస్పిటల్ నిర్లక్ష్య వైద్యానికి ఇద్దరు పసి పిల్లల బలి
కామారెడ్డిలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవరింది.
రామారెడ్డి సెప్టెంబర్ 21 ( జనంసాక్షి ) :
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్రేగి పోతున్నాయని రామారెడ్డి జెడ్పిటిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. గత కొన్ని రోజుల క్రితం ఒక పసిపాప, ఇప్పుడు మళ్ళీ గురువారం ఒక పసిపాప శిశురక్ష హాస్పిటల్ లో వైద్యం వికటించి ఇద్దరు పిల్లలను బలిగొన్నారు. ఫోన్లో హాస్పటల్ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేయగా నిర్లక్ష్య మైన సమాధానం చెప్పి, దురుసుగా ప్రవర్తించారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఈనిర్లక్ష్యానికి పరిహారం చెల్లించక తప్పదు ప్రభుత్వ పర్యవేక్షణ వైఫల్యం వల్లనే పుట్టగొడుగుల్లా అచ్చిరాని వైద్యుల సహాకారంతోని ప్రైవేటు హాస్పటల్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ విషయం గురించి కామారెడ్డి డిఎంహెచ్ ఓ అధికారితో చరవాణిలో సంప్రదించగా ఆయన స్పందించకపోవడం సిగ్గుచేటు చేటన్నారు. ఆయన ద్వారా ఎలాంటి సమాధానం దొరకలేదు. కామారెడ్డిలో అనుభవం లేని వైద్యులచే వైద్యం చేయించి పసి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ పరిస్థితి కారణం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైఫల్యంగానే పూర్తిగా ఖండిస్తున్నాను.




