Thursday, 5 November 2026

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వినతిపత్రం అందజేత
జనంసాక్షి మంథని : మంథనికి విచ్చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందిస్తూ.. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు న్యాయపరమైనవి అని తప్పకుండా పరిష్కారం చూపవలసిందని వీరి సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వీరి సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. అనంతరం బూడిద గణేష్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్ బకాయిలు గా ఉన్నాయని వంట గదిలు సరిగా లేక కట్టెల పొయిల మీద వండడం వలన కార్మికుల కళ్ళు దెబ్బతిని కంటిచూపు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రకటించిన వేతనలు ఇప్పటివరకు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని వీరికి కనీస వేతనాన్ని అమలు చేస్తూ.. ఉద్యోగ భద్రత తోపాటు వీరి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి వసంత, కార్మికులు జ్యోతి, శంకరమ్మ, భాగ్యలక్ష్మి, పర్వతమ్మ తో పాటు సిఐటియు నాయకులు బావు రవి, ఇరుగురాళ ప్రసాద్ లు పాల్గొన్నారు.