Thursday, 5 November 2026

వినాయక చవితి 4వ రోజు ఉత్సవంలో భాగంగా శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ

డోర్నకల్, సెప్టెంబర్ 21, జనంసాక్షి న్యూస్: డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలో సుభాష్ట్రీట్ లోని శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా శ్రీ సాయి ధ్యాన మందిరంలో శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా శ్రీ గణనాథుని దర్శించుకుని ఆలయ ప్రధాన అర్చకులు లోకేష్ చార్యులు చే ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొంది అనంతరం ఆలయ ఆవరణ వద్ద సుమారు 500 వందల మందికి అన్న ప్రసాద వితరణ( అన్నదానం) కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా భాషబోయిన రఘుసాయి మాట్లాడుతూ సర్వ విఘ్నాల అధిపతి విగ్నేశ్వరుని అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. గత 25 సంవత్సరాల నుండి శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు భాగంగా ప్రతిరోజు నిర్వహించే పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. అన్న వితరణ(అన్నదాన) కార్యక్రమంలో భాషబోయిన శ్రీకాంత్, గారా రమేష్, రఘురాం, ఎడమ కంటి నాగమణి రమేష్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.