సొంతింటి కల– సహకారమైన వేళ
సిద్ధమైన పేదల గూడు
:- నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఎమ్మెల్యే
ఎట్టకేలకు పేదలకు గూడు కల్పించేందుకు నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల పట్టాలు దేవరకొండ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ పంపిణీ చేశారు.గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో చింతపల్లి మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ 25 ఇండ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేస్తూ ఈ సందర్భంగా వారు అభివృద్ధి-ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అని అన్నారు.గత ప్రభుత్వాలు, ఇరుకు గదులు, ఇబ్బందులతో కూడిన నిధులు, అతి తక్కువ వ్యయంతో అరకొర వసతులతో ఇచ్చిన ఇండ్లు కాకుండా, సిఎం కెసిఆర్ తెలంగాణలోని నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రభుత్వమే సొంతంగా నిర్మించి, లబ్ధిదారులకు అప్పగిస్తున్నదని ఆయన అన్నారు.సొంత స్థలం ఉన్న పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి,రైతు బంధు అధ్యక్షులు ఉజ్జిని విద్య సాగర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నట్వ గిరిధర్,ప్రదాన కార్యదర్శి ఉజ్జిని నరేందర్ రావు,దండెకార్ ప్రసాద్,ఎల్లంకి అశోక్, అంజి బాబు, తదితరులు పాల్గొన్నారు.




