మహిళలు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలవాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 21( జనం సాక్షి)
మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని సమాజంలో ఆదర్శంగా నిలవాలని వికారాబాద్ జిల్లా, పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలోని ధర్మ విద్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వికారాబాద్ నియోజకవర్గ మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి,60 మందికి ఉచిత కుట్టు మిషన్లు – సర్టిఫికెట్స్అందజేశారు.
మొదటగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.* ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై మరియు బెనిఫిట్స్ పై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.మహిళలను వంటింటికి పరిమితం చేయకుండా వారిలోని నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలన్నారు, ప్రభుత్వం అందించిన కుట్టు మిషన్లు సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మోజేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ దీప భక్త వాత్సల్యం వేణుగోపాల్ కౌన్సిలర్లు రాజ్ కుమార్ శ్రీనివాస్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




