Thursday, 5 November 2026

మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శం
ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

దేవరకొండ సెప్టెంబర్ 21 (జనం సాక్షి):-

నియోజకవర్గంలో నిరంతరాయంగా మిషన్ భగీరథ నీరు అందేలా చూడాలని,
గ్రామాలలో తాగు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని
దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో ENC, RWS, మిషన్ భగీరథ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.
మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం అని,ప్రతి గ్రామానికి,అవాసానికి మిషన్ భగీరథ నీరు అందేలా చూడాలి అని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ENC కృపాకర్ రెడీ ,CE లు చెన్నరెడ్డి, లలిత,SC లు సురేష్, కృష్ణయ్య,EE లు దనుంజ రెడ్డి, ముజిబొద్దిన్,ఎంపీపీలు మాధవరం సునీతజనార్దన్ రావు,వంగల ప్రతాప్ రెడ్డి,జడ్పీటిసిలు సలహాదారులు మరుపాకుల సురేష్ గౌడ్, కంకణాల వెంకట్ రెడ్డి,,RWS, మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు.