Thursday, 5 November 2026

రుద్రారం శంకర్ గౌడ్ చేసిన సేవలు మరువలేనివి 

-రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్

-రుద్రారం శంకర్ గౌడ్ 5వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

సంగారెడ్డి బ్యూరో జనం సాక్షి సెప్టెంబర్ 21

రుద్రారం శంకర్ గౌడ్ 5వ వర్దంతి సందర్భంగా గురువారం ఆయన కుమారుడు భారత్ చక్రవర్తి గౌడ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని వారి చేతుల మీదగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రుద్రారం శంకర్ గౌడ్ చేసిన సేవలను ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. శంకర్ గౌడ్ ను కోల్పోవడం చాల బాధాకరమని అన్నారు. అంతకుముందు రుద్రారం శంకర్ గౌడ్ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్. సుధాకర్ గౌడ్, నాగరాజ్ గౌడ్, ప్రభూ గౌడ్, రామ్ రెడ్డి, మధు గౌడ్, నర్సింలు గౌడ్, మధు గౌడ్, ఫని గౌడ్, దీక్షిత్ గౌడ్, పవన్ గౌడ్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.