Thursday, 5 November 2026

స్థానిక సంస్థలలో మాదిరిగా చట్టసభలలో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి వారిని గౌరవించాలి.

రాష్ట్ర మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 21( జనం సాక్షి)
స్థానిక సంస్థల లో మాదిరిగా చట్టసభలలో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారిని పురుషులతో సమానంగా గౌరవించాలని
తెలంగాణ రాష్ట్ర భూగర్భ గనులు, పౌర సంబంధాలు మరియు సమాచార శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో కలిసి మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా కోట్ పల్లి మండల కేంద్రంలో ర్యాలీలో పాల్గొని, బుగ్గాపూర్ గ్రామంలోని బి ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కోట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం* కార్యక్రమంలో పాల్గొన్నారు.
నూతనంగా నియామకమైన చైర్ పర్సన్ మాణెమ్మ గోపాల్ రెడ్డి వైస్ చైర్మన్ *మహమ్మద్ ఫయాజుద్దీన్ మరియు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.స్థానిక సంస్థలలో మాదిరిగా మహిళలకు చట్టసభలలో కూడా 50 శాతం రిజర్వేషన్ కల్పించి వారిని గౌరవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ పశు గణాభాయి వృత్తి సంస్థ చైర్మన్ ఘాజీపూర్ నారాయణరెడ్డి కోటిపల్లి ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి పెద్దముల్ ఎంపీపీ అనురాధ రమేష్ కోటిపల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి పిఎసిఎస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి కోటిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ మండల్ రైతుబంధు అధ్యక్షుడు సత్యం డాడీ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దశరథ్ గౌడ్ జిల్లా నాయకులు కరణం పురుషోత్తం రావు గోపాల్ రెడ్డి ఎఫ్ ఏ సి ఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.