ఖాతాదారులందరూ బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి:-
రాయికల్ (జనం సాక్షి): మండలంలోని యూనియన్ బ్యాంక్ ఖాతాదారులందరూ తమ బ్యాంకు సేవలైన బంగారు ఆభరణాలపై అత్యధికంగా గ్రాముకి 4300/-రూపాయలు చెల్లించడం జరుగుతుందని మరియు ఒక ఖాతాదారుడు కోటి రూపాయల వరకు బంగారంపై రుణం పొందే అవకాశం ఉందని ఇవేగాక వ్యాపారస్తులకి బిజినెస్ లోన్స్, ముద్ర లోన్స్, రైతులందరికీ క్రాఫ్ లోన్స్, సొంత ఇంటి కల ఉన్నవారికి హోమ్ లోన్స్, చిన్న తరహా, పెద్ద తరహా వాణిజ్య వ్యాపార అవసరాలకి సబ్సిడీతో కూడిన లోన్లు పొందవచ్చని రాయికల్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ తిరుపాల్ నాయక్ తెలియజేయడం జరిగింది.




