రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఆకునూరు విద్యార్థుల ఎంపిక
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 21: చేర్యాల మండల పరిధిలోని ఆకునూరు
గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వల్లాల శిరీష, జనగాం అమూల్య రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికయ్యారు. ఈ
సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు
ఎం.ఐలయ్య మాట్లాడుతూ.. సెప్టెంబర్ 22, 23,
24వ తేదీలలో పిరమిడ్ స్పిర్చువల్ సెంటర్, ఖడ్తాల్ హైదరాబాద్ లో జరిగే యోగ పోటీల్లో ఇద్దరు విద్యార్థులు పాల్గొంటున్నట్లు హెచ్ఎం తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పీటీ ఎం.కవితను ఎం. ఐలయ్య, గ్రామ సర్పంచ్ చీపురు రేఖా మల్లేష్ యాదవ్, ఎంపీటీసీ సుంకరి శ్రీధర్ గౌడ్, మిత్ర యూనిట్ సభ్యులు, గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు అభినందించారు.




