Thursday, 5 November 2026

వడపర్తి లోఉచిత మెగా వైద్య శిబిరం.

భువనగిరి టౌన్ ( జనం సాక్షి):–భువనగిరి
మండలంలోని వడపర్తి, గ్రామ సర్పంచ్ కృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడము జరిగినది. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి,ముక్కు,గొంతు,వరిబీజము, బీజకుట్టు,గడ్డలు,కనతులు, థైరాయిడ్ గడ్డలు,గర్భ సంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు చూసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమమునకు, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ లు, గ్రామ ప్రజలు పాల్గొనడము జరిగింది. ఈ వైద్య శిబిరంలో 200,మందికి షుగర్, బీపీ, టెస్టులు చేయడం జరిగినది,ఆపరేషన్ అవసరము ఉన్న వాళ్ళ 50 మందిని రిపర్ రాయడం జరిగింది.వీరిని ప్రవేట్ హాస్పిటల్ కు తరలించి ఉచిత ఆపరేషన్లు చేయడం జరుగుతుంది.
ఈ వైద్య శిభిర కార్యక్రమంలో డాక్టర్లు ఇంద్రా,హరి,రవితేజ రెడ్డి,యశ్వంత్,ఆర్శిత,హవ్య మార్కెటింగ్ ఇంచార్జి కుమార స్వామి , బాలకృష్ణ ,చెరాలు,పాల్గొనడం జరిగింది..