Thursday, 5 November 2026

వల్లభాపూర్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన

మండల ప్రధాన కార్యదర్శి
ఓడ్డపల్లి రాజగోపాల్

వీణవంక సెప్టెంబర్ 21 (జనం సాక్షి )వీణవంక మండలంలోని వల్భపూర్ గ్రామంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా పద్మశాలి సేవా సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఒడ్డపల్లి రాజగోపాల్ ఆధ్వర్యంలో . పద్మశాలి సంఘం జిల్లా నాయకులు అరుకాల వీరేశలింగం ముఖ్య అతిథిగా హాజరై వారు కలిసి. కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలన్నారు.అలాగే బాపూజీ చేసిన నిస్వార్థ సేవను కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో తాను ముందుండి తెలంగాణ ప్రజలను నడిపించారని వారు కలలుగన్న తెలంగాణను భావితరాలు గుర్తుంచుకొని ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో బూర వెంకట్రాజం, మాశ పత్తుల పోచమల్లు, గాదె సంపత్, గుణసాగర్,ఒడ్డపల్లి మధు,శ్రీనివాస్, సది,లక్ష్మీనారాయణ తోపాటు తదితరులు పాల్గొన్నారు.