Thursday, 5 November 2026

 

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రభుత్వ చేయూత

వనపర్తి బ్యూరో సెప్టెంబర్22 (జనంసాక్షి)అన్ని రకాలుగా దివ్యాంగులకు ప్రభుత్వ సహకారం ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నాడు
దివ్యాంగులైన పిల్లలు 128 మందికి వీల్ చైర్స్ , హియరింగ్ ఎయిడ్స్ తదితర ఉచిత ఉపకరణాలు, 270 మంది మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్ల ను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రభుత్వ చేయూత అందిస్తుందని అన్నారు.దివ్యాంగులకు అందరూ ప్రేమను పంచాలని,వారికి తల్లితండ్రులు అన్ని విధాలా అండగా ఉండాలన్నారు.రూ.4016 ఆసరా ఫించను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ నే అని,చదువుకుంటున్న దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలతో ప్రోత్సాహన్నీ అందిస్తున్నామని చెప్పారు.చదువుకుంటున్న విద్యార్థులకు రూ.500 రవాణా భత్యం,అవసరమైన విద్యార్థులకు వారానికి ఒకసారి ఫిజియోథెరపీ,ప్రతి సబ్జెక్టుకు 20 మార్కులు వస్తే దివ్యాంగులు ఉత్తీర్ణత .. మానసిక దివ్యాంగులకు 10 మార్కులు వస్తే ఉత్తీర్ణత కల్పిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించి దివ్యాంగులకు విద్యాబోధన,దివ్యాంగుల కోసం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతల తో పాటువారికి మనందరం అభినందనలు తెలపాలన్నారు.దివ్యాంగులైన పిల్లలకు కాలక్రమంలో మంచిగ అవుతుందన్నా ఆశాభావంతో పనిచేయాలి ప్రభుత్వం నుండి వచ్చిన ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఆడబిడ్డలు వారి కాళ్ల మీద వారు నిలబడాలని,కుట్టుమిషన్లతో జీవనోపాధి పొందాలి  గతం కన్నా కుట్లు, అల్లికల పనులకు ఆదరణ పెరిగిందని,అనేకమంది మహిళలు ఈ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారని గుర్తు చేశారు.ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా చేయూత అందిస్తున్నామని వివరించారు.
సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండారు కృష్ణ,లక్మి నారాయణ , స్టార్ రహీం ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు పరంజ్యోతి,ఎం,ఏ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.