ఫైజాబాద్ లో ఘనంగా గణేష్ నవరాత్రోత్సవాలు….

ప్రత్యేకపూజలు చేసిన అన్నదాత దండిగే బాబురావు

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :-
మండలం పరిధిలోని ఆయా గ్రామాలలో వాడవాడల వెలిసిన వినాయకుడి నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మండపాల వద్ద ప్రత్యేక అలంకరణలు, అన్నదాన కార్యక్రమాలు, హెూమాలు వివిధ రకాల పూజలు నిర్వహిస్తూ, విఘ్నాలను తొలగించే వినాయకుడికి భక్తి శ్రద్ధలతో భక్తులంతా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.శుక్రవారం ఫైజాబాద్ లోని శ్రీ ముత్యాల పోచమ్మ యూత్ ఆధ్వర్యంలో అన్నదాత దండిగే రాజమణి కుమారుడు బాబురావు వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు,గ్రామస్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేసిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకొని అన్నదానాలను ఆశీర్వదించారు. వారిపై ఎల్లప్పుడు గణనాధుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు,గ్రామా పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.