వెల్డింగ్ వర్క్ షాపు ను ప్రారంభోత్సవం చేసిన వంగూర్ ప్రమోద్ కుమార్ రెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్25 (జనంసాక్షి)

వనపర్తి మండలం చందాపూర్ గ్రామానికి చెందిన బీసీ బంద్ లబ్ధిదారుడు బాలకృష్ణ చారి వెల్డింగ్ వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
వనపర్తి నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రిబ్బన్ కత్తిరించి లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలిపారు. చందాపూర్ గ్రామంలోని రైతు వేదిక మరియు ప్రకృతి వనంను సందర్శించడం జరిగింది.వారితో పాటు వనపర్తి పట్టణ యువజన అధ్యక్షుడు &మార్కెట్ డైరెక్టర్ సూర్యవంశం గిరి, మార్కెట్ డైరెక్టర్ యుగంధర్ రెడ్డి, మండల యువజన అధ్యక్షులు చిట్యాల రాము, మండల ఉపాధ్యక్షులు కురుమూర్తి, గ్రామ సర్పంచ్ చిన్నారెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగరాజు యూత్ అధ్యక్షులు నరేందర్ మండల యూత్ ఉపాధ్యక్షులు శ్యామ్ లాల్ యాదవ్, మహేందర్ యాదవ్, రాములు, మదిలేటి, తిమ్మన్న, నాగేష్, రామస్వామి , తదితరులు పాల్గొన్నారు