ఘననాధునికి ఘనమైన పూజలు

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : గణపతి నవరాత్రులను పురస్కరించుకొని 8వ రోజు విగ్నేశ్వరుడు భక్తుల నుండి విశేష పూజలు అందుకున్నాడు. స్థానిక భగత్ సింగ్ నగర్ హాట్స్ ఏరియాలోని ఫ్రెండ్స్ గణపతి మండపం వద్ద కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.ఉదయం విశిష్ట పూజల అనంతరం కమిటీ ఆధ్వర్యంలో లడ్డు, కలశం వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో లడ్డును రూ. 4316 లకు ఎంబడి రాంచందర్, కళశంను రూ.4516 లకు తూము చంద్రయ్య దక్కించుకున్నారు. మహా అన్నదాన కార్యక్రమంలో మహిళ భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.