కానాయపల్లి ముంపు బాధితులు పరిష్కార మార్గంతో రావాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ .
నపర్తి బ్యూరో సెప్టెంబర్25 (జనంసాక్షి)
కానాయపల్లి ముంపు బాధితులు తమ పునరావాస కేంద్రం విషయంలో ఒక పరిష్కార మార్గంతో రావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు. సోమవారం ఉదయం కానాయపల్లీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు బాధితులు కలెక్టర్ తో కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో వారితో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పి.డి. యఫ్ అవార్డు పొందిన 1034 ముంపు కుటుంబాలకు లక్కీ డిప్ ద్వారా ప్లాట్లు కేటాయించి అనంతరం 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న వారికి, పి. ఎ.ఎఫ్ అవార్డు పొందిన వారి తగిన న్యాయం చేస్తామని తెలిపారు. స్పందించిన ముంపు బాధితులు 1034 పి.డి.ఎఫ్ అవార్డు పొందిన వారికి ఇప్పుడు ప్లాట్లు ఇచ్చి తర్వాత పి. ఎ.ఎఫ్, వారికి ప్లాట్లు ఇవ్వడం వల్ల పి. ఎ.ఎఫ్ పొందిన 95 మంది నష్టపోతారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ముంపు బాధితుల కుటుంబం లో పి.డి.ఎఫ్.తో పాటు పి.ఈ.ఎఫ్ అవార్డు పొందిన వారు, 18 సంవత్సర వయస్సు నిండిన వారు, జాబితా లో పేర్లు మిస్ అయిన వారు ఉన్నారని, అందరికీ ఒకేసారి ఇస్తే కుటుంబం వారీగా పక్కపక్కనే ఇళ్లు తీసుకుంటామని తెలిపారు. లక్కీ డిప్ ద్వారా కాకుండా ఎస్. ఈ.ఎస్ పద్దతిలో ప్లాట్లు కేటాయించాలని కలెక్టర్ ను కోరారు. ఇందుకు కలెక్టర్ సమాధానం ఇస్తూ పి. ఎ.ఎఫ్ పొందిన వారికి ప్లాట్లు ఇవ్వడానికి ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అప్పటి వరకు ప్రస్తుతం పి.డి.ఎఫ్ అవార్డు పొందిన వారికి ప్లాట్లు కేటాయిస్తామని తెలిపారు. అనంతరం 18 సంవత్సరాలు నిండిన వారికి , పి. ఎ.ఎఫ్ వారికి సైతం న్యాయం చేసేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు గ్రామస్థులు అభ్యంతరం తెలపడంతో మీరే ఒక పరిష్కార మార్గం తో రావాలని, అప్పుడు దాని అమలుకు సాధ్యసాధ్యాల పై చర్చిద్దామని చెప్పారు. అందుకు గ్రామస్థులు అంగీకరిస్తూ ఒక పరిష్కార మార్గం తో వస్తామని సంతోషంగా వెళ్ళారు. అదనపు కలెక్టర్ యస్. తిరుపతి రావు, కొత్తకోట తహశీల్దార్ బాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రావుల సుదర్శన్ రెడ్డి.వైస్ ఎంపిపి వడ్డె శ్రీను,రాసమోని శ్రీను, బాజ గీరన్న, భీమన్న నాయుడు, ఇరుపునూరి రాజు, రవీందర్ గౌడ్, దారమోని గోవర్దన్, వడ్డె నాగరాజు, దారమోని బాలరాజు తో పాటు మరియు గ్రామ యువకులు పాల్గన్నారు.




