మారుపాకలో ‘స్వచ్ఛత హీ సేవ’ కార్యక్రమం
వేములవాడ, అక్టోబర్ 1 (జనంసాక్షి): వేములవాడ అర్బన్ మారుపాక గ్రామంలో ఆదివారం స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా రోడ్లను శుభ్రం చేశారు. గ్రామంలో ఉన్న వయ్యారిభామ కలుపు మొక్కలను తొలగించారు.
ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ శ్రీమతి స్వయం ప్రభ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి, దొబ్బల మల్లేశం, పరశురాం, వార్డు మెంబర్ తుమ్మల రాజవ్వ, రైతు బందు సమన్వయకర్త పిట్టల అంజయ్య, అంగన్‌వాడీ టీచర్లు, EGS ఫీల్డ్ అసిస్టెంట్ బానయ్య, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ విద్య నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు డి.జహానవి, కె.జెరుషా పెర్సిస్, ఆర్.పవిత్ర, వి.లిఖిత నాయక్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు