హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ పరిపాలన విభాగం, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎంజీ గోపాల్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా రంజీవ్ ఆర్ ఆచార్య, జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కమిషనర్లుగా నవీన్ మిట్టల్, వీర బ్రహ్మయ్య, అదనపు కమిషనర్లుగా జి. కిషన్, గౌరవ్ ఉప్పల్, పౌసమిబసు, హైదరాబాద్ కలెక్టర్‌గా కె. నిర్మల, జాయింట్ కలెక్టర్‌గా కె. సురేంద్ర మోహన్, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా భారతి, రంగారెడ్డి కలెక్టర్‌గా ఎం. రఘునందన్ రావు, జాయింట్ కలెక్టర్లుగా రజట్ కుమార్ సైనీ, హరిచందన, వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా ఎ. వర్షిణి, నల్లగొండ కలెక్టర్‌గా డి. సత్యనారాయణరెడ్డి, వరంగల్ కలెక్టర్‌గా వి. రమణ, జాయింట్ కలెక్టర్‌గా పాటిల్ ప్రశాంత్ జీవన్, వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్, ఖమ్మం జిల్లా పాల్వంచ సబ్ కలెక్టర్‌గా కాళీ చరణ్ సుధమ్‌రావు, కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా నీతూకుమారి ప్రసాద్, జగిత్యాల సబ్ కలెక్టర్‌గా జి. కృష్ణ భాస్కర్, మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా టి.కె. శ్రీదేవి, ఆదిలాబాద్ కలెక్టర్‌గా జీడీ ప్రియదర్శిని, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా రాజీవ్‌గాంధీ హన్మంతు నియామకం కానున్నారు.




