సచివాలయం: రాజీవ్ స్వగృహాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి హౌసింగ్, రాజీవ్ స్వగృహ అధికారులు హాజరయ్యారు. ఇప్పటి వరకు 3,336 ఇళ్లు పూర్తిగా, 2,229 ఇళ్లు పాక్షికంగా పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఎన్జీవోలు, పాత్రికేయులకు రాజీవ్ స్వగృహ ఇళ్లు కేటాయించే అంశంపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ-వేలం ద్వారా రాజీవ్ స్వగృహ ఇళ్లు అమ్మాలని నిర్ణయించారు.




