24న రాష్ట్ర బంద్
హైదరాబాద్, సెప్టెంబర్ 16 : సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక తన భవిష్యత్తు కార్యాచరణను సోమవారం సాయంత్రం వెల్లడించింది. ఈ నెల 19, 20 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిం చాలని, 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యుత్ నిలిపేసి స్వచ్చందంగా నిరసన తెలిపాలని కోరింది. అలాగే ఈ నెల 24న రాష్ట్ర బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. 25, 26 తేదీల్లో రాష్ట్రంలో ట్రావెలర్ల బంద్ పాటించాలని, 27, 28 తేదీల్లో కేంద్ర కార్యాలయాలను మూసివేయాలని వేదిక పిలుపునిచ్చింది. అంతేగాక ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని కోరింది.



