మాజీమంత్రి మోపిదేవికి బెయిల్
హైదరాబాద్, సెప్టెంబర్ 16 : మాజీ మంత్రి మోపిదేవికి నాంపల్లి సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు వ్యక్తులు, లక్ష రూపాయల పూచీకత్తు ఇవ్వాలని సోమవారం సాయంత్రం ఆదేశించింది. 45 రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. వైద్య చికిత్సకే ప్రాధాన్యత ఇవ్వాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, హైదరాబాద్ వదిలి ఎక్కడకు వెళ్లరాదని ఆంక్షలు విధించింది. నవంబరు ఒకటో తేదీన కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఇటీవల ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులలో మోపిదేవి పలుమార్లు వైద్యపరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా జగన్ ఆస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవి సుమారుగా ఏడాదికాలంగా చంచల్‌గూడ జైలులోనిందితునిగా ఉంటున్న విషయం తెలిసిందే.



