రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు
హైదరాబాద్: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చొట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కదులుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలపడింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలుకురిసే అవకాశం ఉన్నట్లు అధికారలు తెలిపారు. రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వారువివరించారు.



