Tuesday, 3 November 2026

మరో 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం

హైదరాబాద్‌: మరో 24గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో… ఇదే పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడ్డానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడితే… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్గాల్లో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్రమీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా ఉత్తర కోస్తాలో పలు చోట్ల వానలు కురుస్తున్నాయి. రాగల 24గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల, తెలంగాణ, రాయలసీమల్లో చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *