వెల్లింగ్టన్ : భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ జరుగుతోంది. మూడవ రోజు (నేడు) ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ మెక్‌కల్లమ్ (114), వాల్టింగ్ (52) పరుగులతో క్రీజులో ఉన్నారు.




