ఆర్టీసీ సమస్యపై చర్చించే అవకాశం
హైదరాబాద్,నవంబరు 26(జనం సాక్షి): ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ భేటీ కొనసాగనుంది. 29వ తేదీన కూడా మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీలో ఇతర అంశాలతో పాటు ఆర్టీసీ అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్టీసీ సమస్యను ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
28న కేబినేట్ భేటీ




