Tuesday, 3 November 2026

ఇంకెంతమంది బలిదానాలు చేసుకోవాలి

కార్మికులను ఎందుకు విధుల్లోకి తీసుకోరు: రేవంత్‌
హైదరాబాద్‌,నవంబరు 26(జనం సాక్షి): ఇంకెంతమంది ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకోవాలని కాంగ్రెస్‌ నేత,మల్కాజిగిరి ఎంపి రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. సమ్మె విరమించినా వారిని విదుల్లోకి చేర్చుకోక పోవడంలో ఆంతర్యమేమిటన్నారు. తెలంగాణలో ఆర్టీసి సమ్మె 52 రోజులపాటు సాగింది. అయితే సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు కార్మికులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా కార్మికులను విధులకు రానివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్న విషయంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విమర్శించారు. నియంతృత్వం, దుర్మార్గ పాలనకు పరాకాష్ఠగా ప్రభుత్వం మారిందన్నారు. ఇంకా ఎంత మంది చనిపోతే విూ రక్తదాహం తీరుతుంది? చనిపోయిన ముప్పై మంది కార్మికుల కుటుంబాల ఉసురు తగులుతుందని అన్నారు. ఆర్టీసి కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.మహారాష్ట్రలో బీజేపీ అనుసరిస్తున్న పద్ధతి అప్రజాస్వామికమైనదని కాంగ్రెస్‌ నేత వి.విమర్శించారు. గవర్నర్‌ బీజేపీకి అనుకూలంగా పనిచేశారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తోందన్నారు. దేశం ఎటుపోయినా పర్వాలేదు కానీ, తాము మాత్రం అధికారంలో ఉండాలని బీజేపీ కోరుకుంటోందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కోర్టు అనుకూలంగా తీర్పు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, శివసేన, ఎన్పీపీ పార్టీలు కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.