Monday, 2 November 2026

29న సిఎం చేతుల విూదుగా ధరణి

తహసిల్దార్లకు ఒకరోజు శిక్షణలో  సిఎస్‌
మేడ్చల్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): ఈ నెల 29న సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ ప్రారంభిస్తారని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ తెలిపారు. కేసీఆర్‌ ఆలోచనల మేరకు ధరణి పోర్టల్‌ రూపకల్పన జరిగిందని చెప్పారు. తాసీల్దార్‌ సెలవులో ఉంటే నయాబ్‌ తాసిల్దార్‌ పని చేయాలన్నారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వస్తే రిజిస్టేష్రన్‌, మ్యుటేషన్‌ వెంటనే జరిగిపోతాయని వెల్లడించారు. ఎవరి పేరుపై భూమి ఉంటుందో వారి ఆధార్‌ ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. మోసం చేయడానికి ఎలాంటి ఆస్కారం లేదని స్పష్టం చేశారు.  ప్రభుత్వ భూమి, వక్ఫ్‌, దేవాలయ భూములను ఆటోలాక్‌లో పెట్టినట్లు సీఎస్‌ సోమేష్‌కుమార్‌ వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌ ప్రారంభానికి ముహుర్తం ఖరారైన విషయం తెలిసిందే. ధరణి పోర్టల్‌ ప్రారంభానికి రంగారెడ్డి జిల్లా వేదిక కానుంది. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ ను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధరణి’ నిర్వహణపై తాసిల్దార్లకు ఒకరోజు శిక్షణ ఇచ్చింది.  మంగళవారం ఘట్‌కేసర్‌ సవిూపంలోని అనురాగ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు తాసిల్దార్లు, నాయబ్‌ తాసిల్దార్లు,  కంప్యూటర్‌ ఆపరేటర్లు హాజరయ్యారు. వీరికి ఉదయం థియరీ క్లాసులు,  సాయంత్రం ప్రాక్టికల్‌ క్లాసులు నిర్వహించారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్‌
8 నుంచి రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాలను రాష్ట్రప్రభుత్వం నిలిపివేసింది. అక్టోబర్‌ 29 నుంచి అవన్నీ పునర్‌ప్రారంభమవుతాయి.  20 నుంచి 40 వరకు నమూనా రిజిస్టేష్రన్‌, మ్యుటేషన్‌లను చేపట్టారు.