బంగారం ధర.. రూ.29,700!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 : వెండి ధర 50వేల దిగువకు చేరుకుంది.. అలాగే బంగారం ధర కూడా 30వేల రూపాయలకు దిగువకు చేరుకుంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో సోమవారం ఉదయం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. 24 క్యారెట్ల బంగారం ధర 29,700 రూపాయలు కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 27,200 పలికింది. అలాగే వెండి కిలో ధర 49,500 రూపాయలకు చేరుకుంది. ఇదిలా ఉండగా మంగళవారం మరో 400 రూపాయల మేర బంగారం ధర తగ్గే అవకాశం ఉందని సమాచారం.

 

తాజావార్తలు