హైదరాబాద్,జూన్1(జనంసాక్షి): గ్రేటర్‌లో ఈ నెల 3 నుంచి 15 రోజులు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాలా, గార్బేజి, హరితహారం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎస్‌ఎన్‌డీపీతో నగరంలో నాలాల
అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో పట్టణ ప్రగతి రివ్యూ ముగిసిన అనంతరం మంత్రి విూడియాతో మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి సహకారం అందించాలని కోరారు. గత ప్రభుత్వాలు నాలాలను పట్టించుకోలేదని… కానీ తాము దూరదృష్టితో పనులు చేపడుతున్నామన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ముంపు ప్రభావం తగ్గుతుందని తెలిపారు. వచ్చే నాటికి ముంపు ప్రభావం లేకుండా చూస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడిరచారు.
3నుంచి రాజధానిలో పట్టణప్రగతి: తలసాని




