Monday, 2 November 2026

సివిల్స్‌ విజేతలకు మంత్రి అభినందనలు

దేశ సేవలో ముందుండాలన్న హరీష్‌ రావు
హైదరాబాద్‌,జూన్‌1(జ‌నంసాక్షి): సివిల్స్‌ విజేతలు తమ ఉద్యోగ నిర్వహణలో దేశం కోసం పనిచేయాలని
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశానికి అత్యున్నత సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. ఇటీవల విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పలువురికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడవిూ డైరెక్టర్‌, మెంటార్‌ మల్లవరపు బాలలత నేతృత్వంలో సివిల్స్‌ ర్యాంకర్లు హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి హరీశ్‌రావు ఘనంగా సత్కరించారు. సివిల్స్‌లో ర్యాంకులు సాధించి తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచారని మంత్రి అభినందించారు. స్వయంగా ఐఏఎస్‌ అయిన బాలలత.. హైదరాబాద్‌లో ఐఏఎస్‌ శిక్షణ సంస్థ సీఎస్‌బీ అకాడవిూని ఏర్పాటుచేసి ఇప్పటివరకు వందమందికిపైగా సివిల్స్‌ విజేతలను తీర్చిదిద్దడం గర్వకారణమన్నారు.సీఎస్‌బీ అకాడవిూ నుంచి భవిష్యత్తులో మరింత మంది విజేతలు రావాలని, దేశానికి అత్యున్నత సేవలు అందించాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. సివిల్స్‌ విజేతలను సన్మానించి ప్రోత్సహించినందుకు మంత్రికి బాలలత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎస్‌బీ అకాడవిూ ద్వారా మరింతమంది సివిల్స్‌ ర్యాంకర్లను దేశానికి అందిస్తామని ఆమె హావిూనిచ్చారు. ఇప్పటికే తెలుగువారు పెద్దసంఖ్యలో సివిల్స్‌ విజేతలుగా నిలిచారన్నారు. మంత్రిని కలిసిన వారిలో సుధీర్‌కుమార్‌రెడ్డి (ర్యాంక్‌`69), అరుగుల స్నేహ (136), బీ చైతన్య రెడ్డి (161), రంజిత్‌కుమార్‌ (574), స్మరణ్‌రాజ్‌ (676)తో పాటు ఎన్‌ఆర్‌ఐ మల్లవరపు సరిత ఉన్నారు.