హైదరాబాద్,అక్టోబర్24(జనంసాక్షి): అసెంబ్లీ సమావేశాలకు 3వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. 27 నుంచి జరిగే అసెంబ్లీ సమావేవాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలతో పాటు నిషేధాజ్ఞలు విధించామని అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… బందోబస్తుపై శాసనసభ స్పీకర్ మధుసుదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో సవిూక్షించామన్నారు. శాంతిభద్రతలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సీపీ తెలిపారు. అలాగే అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు. అసెంబ్లీ ఆవరణంలో గుర్తింపు ఉన్న సభ్యులను మాత్రమే అనుమతివ్వటం జరుగుతుందని, వారికి కేటాయించి ప్రదేశాల్లోనేకూర్చొనేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఈ సమావేశాలు జరిగే రోజుల్లో చుట్టుపక్కల ఎవరూ సంచరించకుండా ఉండేందుకు నిషేదాజ్ఞలు విధించటం జరిగిందన్నారు. హైదరాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లను తగు సూచనలు చేశామన్నారు. వారి వారి ఏరియాల్లో తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేసేలా ఆదేశించటం జరిగిందన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు అందరూ డ్యూటీలో ఉండేలా ఆదేశించాలు జారీ చేయటం జరిగిందన్నారు.





