Monday, 2 November 2026

ఆర్టికల్‌ 3 ప్రకారమే రాష్ట్ర విభజన : రాజనర్సింహ

హైదరాబాద్‌ : ఆర్టికల్‌ 3 ప్రకారమే రాష్ట్ర విభజన జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి రామోదర రాజనర్సింహ అన్నారు. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి సీఎల్పీ కార్యాలయంలో రాజనర్సింహ మీడియా సమావేశం నిర్వహించారు. రాజనర్సింహ మాట్లాడుతూ… రాష్ట్ర విభజనకు సంబంధించి శాసనసభలో జరగాల్సిన కార్యక్రమం ముగిసింది. కేంద్ర సరైన దిశలో నిర్ణం తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రికి చరిత్ర తెలియదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడక ముందు తెలంగాణ ఇండియన్‌ యూనియన్‌లో భాగమని వివరించారు. నాయకుడు రాష్ట్రానికి నాయకుడిగా వ్యవహరించాలి కానీ ప్రాంతానికి కాదన్నారు. మెజార్టీ చెప్పినట్టే జరగాలంటే అసలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేదే కాదన్నారు. కారణం లేకుండా రాష్ట్రాన్ని విబజిస్తున్నారన్న సీఎం వాదన అర్థం లేనిదన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *