హైదరాబాద్ : శాసనసభలో ఇవాళ ఒక ప్రహసనం ముగిసిందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ… శాసనసభలో జరిగిన ప్రహసనాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బిల్లును తిరస్కరిస్తూ చేసిన తీర్మానం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. రేపటి నుంచి ప్రధాని సహా జాతీయ నేతలందరినీ తెరాస నేతలు కలుస్తారని వివరించారు. ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం, సీఎం రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.




