30న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం
హైదరాబాద్,అగస్టు26(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సమావేశం ఈనెల 30న జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో జరిగే సమావేశంలోబ్జడెట్ కేటాయింపులు, మంజూరు, వ్యయాలు, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి ఆడిట్ వివరాలపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు. అలాగే సెప్టెంబరు 4వ తేదీన అసెంబ్లీ అష్యూరెన్స్ కమిటీ నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు జరిగే సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన హావిూలు, అమలుతీరు, పర్యావరణ, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయితీరాజ్ శాఖకు సంబంధించిన ఇచ్చిన హావిూలను కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.