కులకచర్ల: రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో కలుషిత ఆహారం తిన్న 30మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా విద్యార్థులు భోజనంలో నాణ్యత లేదంటూ ఆందోళనకు చేస్తున్నారు. దీంతో భోజనం సైతం సరైన సమయంలో చేయలేకపోయారు. మంగళవారం రాత్రి ఉడికి ఉడకని అన్నం తినడంతో రాత్రి నుంచి విద్యార్థినుల అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.




