Monday, 2 November 2026

పదో తరగతి బాలికపై గ్యాంగ్ రేప్

జ‌నంసాక్షి: ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చిన మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు , వేధింపులు నిరోధించ‌డంలో ప్ర‌భుత్వం వైఫ‌ల్యం క‌న‌ప‌డుతూనే ఉంది.
దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. ఐదుగురు దుండుగులు పదో తరగతి విద్యార్థిని తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారం రోజుల క్రితం బాధితురాలు స్కూల్కు వెళ్తున్న సమయంలో నిందితులు ఓ ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. మొబైల్ ఫోన్లో వీడియా తీశారు. ఈ సంఘటన గురించి బయటకే చెప్పరాదంటూ తుపాకీతో ఆ అమ్మాయిని బెదిరించారు. బాధితురాలు అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఈ సంఘటన గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.అఘాయిత్యానికి పాల్పడ్డ వారందరూ ఆ అమ్మాయికి తెలిసినవారే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *