హైదరాబాద్: ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి అభివృద్ధి కోసం రూ.3.8 కోట్లు విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. ఇవాళ మానసిక ఆస్పత్రిని సందర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతూ మౌళిక సదుపాయాల కల్పనకు తక్షణ ప్రాతిపదికన రూ.80 లక్షలు విడుదల చేస్తానని స్పష్టం చేశారు. మానసిక వైద్యవిద్య పీజీ విద్యార్థులకుల హాస్టళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. హోంమంత్రితో మాట్లాడి ఆస్పత్రి వద్ద ఔట్‌పోస్టును ఏర్పాటుచేయిస్తానని తెలిపారు.




