న్యూఢిల్లీ, ఆగస్టు 21 : లాలూప్రసాద్ యాదవ్, నితీష్‌కుమార్‌ల దోస్తీ నేపథ్యంలో బీహార్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో రాజకీయ పునరీకరణ ప్రభావం ఎలాఉందో ఈ ఉప ఎన్నికలల్లో తేలనుంది. కర్నాటకలో మూడు, మధ్యప్రదేశ్‌లో మూడు, పంజాబ్‌లో రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో విజయబావుట ఎగురవేసిన బీజేపీ ఉప ఎన్నికల రూపంలో బీహార్‌లో తొలి పరీక్ష ఎదుర్కొంటోంది. అక్కడ మొత్తం 10 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నార్కాటియాగంజ్, రాజ్‌నగర్, బాంకా, జలే ఛాప్రా, హాజీపూర్, మొహియుద్దీన్‌నగర్, పర్‌బట్టా, భాగల్పూర్, మొహానియాలలో జరగుతున్న ఉప ఎన్నికలను బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే అటు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన మహా కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఈ పది స్థానాల్లో 6 బీజేపీ, 3 ఆర్జేడీ, 1 జేడీ(యూ) సిట్టింగ్ స్థానాలు. ప్రత్యర్థి స్థానాలపైనా దృష్టిపెట్టిన పార్టీలు పోలీని నువ్వా నేనా అన్నట్లు మార్చేసాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాలవద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.




