Tuesday, 3 November 2026

4న ముల్కీ అమరవీరులకు కొవ్వొత్తుల నివాళి – కోదండరాం

హైదరాబాద్‌: ముల్కీ అమరవీరులను స్మరిస్తూ ఈనెల 4వతేదీ సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించాలని రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఛలో హైదరాబాద్‌ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ మార్చ్‌కు ప్రజలను సన్నద్దం చేసేందుకు మరిన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. ఈనెల 6న జరిగే స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో ఈ కార్యక్రమాలపై తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఢిల్లీలో భాజపా, తలపెట్టిన తెలంగాణ దీక్షకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కోదండరాం వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *